మనోజ్..మౌనికపై మోహన్ బాబు ఫిర్యాదు
తనకు ప్రాణహాని ఉందంటూ ఆవేదన
హైదరాబాద్ – మంచు మోహన్ బాబు కుటుంబం ఫక్తు సినిమాను తలపింప చేస్తోంది. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం సినిమా రంగాన్ని విస్తు పోయేలా చేసింది. నిన్నటి నుంచి మోహన్ బాబుకు సంబంధించిన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
వీరి మధ్య చోటు చేసుకున్న విభేదాలను పరిష్కరించేందుకు శ్రీశైలం యాదవ్ ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మంచు మనోజ్ ఉన్నట్టుండి హైదరాబాద్ లోని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షం అయ్యాడు. తనపై దాడికి పాల్పడ్డారని, వీరి వెనుక తన తండ్రి ఉన్నారంటూ ఆరోపించారు.
ఇదిలా ఉండగా ఉన్నట్టుండి మంచు మనోజ్ ఫిర్యాదు చేసిన అనంతరం మోహన్ బాబు రంగంలోకి దిగారు. ఆయన నేరుగా రాచకొండ సీపీ ఆఫీసుకు వెళ్లారు. తనకు ప్రాణహాని ఉందంటూ ఆరోపించారు. తనతో పాటు తన భార్యపై కూడా దాడికి దిగారంటూ, తనను చంపినా ఆశ్చర్య పోయేలా చేసింది . తమకు రక్షణ కల్పించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ ను కోరారు.