వరద బాధితులకు మోహన్ బాబు విరాళం
ఏపీ సీఎం సహాయ నిధికి రూ. 25 లక్షలు
అమరావతి – ప్రముఖ నటుడు, మోహన్ బాబు యూనివర్శిటీ చైర్మన్ మంచు మోహన్ బాబుతో పాటు తనయుడు , నటుడు తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.
ఈ సందర్బంగా తండ్రీ కొడుకులు ఇద్దరూ మానవతా దృక్ఫథంతో ఏపీలో ఇటీవల చోటు చేసుకున్న వరదల కారణంగా తీవ్రంగా నష్ట పోయిన వరద బాధితులకు తమ వంతు సాయం ప్రకటించారు. ఈ మేరకు రూ. 25,00,000 చెక్కును ఏపీ సీఎం సహాయ నిధికి గాను చంద్రబాబు నాయుడుకు అందజేశారు.
ఇదిలా ఉండగా మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమా తీస్తున్నారు. దాని గురించి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారని ఈ సందర్బంగా తెలిపారు మా అసోసియేషన్ చీఫ్ . అంతే కాకుండా తన ఆర్ట్ వర్క్ పై కూడా ఆటో గ్రాఫ్ పొందారంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఏపీ సహాయ నిధికి తమ వంతు సాయం చేశారు.
సినీ రంగానికి చెందిన నటీ నటులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారు. వారిలో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ , డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ , తదితరులు ఉన్నారు.