టచ్ చేశా..దాడి చేయలేదు
మంచు మోహన్ బాబు ప్రకటన
హైదరాబాద్ – నటుడు మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ఏనాడూ మీడియాపై దాడి చేయలేదన్నారు. ఇతరుల కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటారా అని ప్రశ్నించారు. ప్రజలు, నేతలు ఆలోచించాలని అన్నారు. అయితే తాను దాడి చేస్తానని అనుకోలేదన్నారు. నిజ జీవితంలో నటించాల్సిన అవసరం లేదని, జరిగిన ఘటనకు బాధ పడుతున్నానని పేర్కొన్నారు.
మీడియాను ఉద్దేశించి కీలక ప్రకటన విడుదల చేశారు. కేవలం టీవీ9న యాజమాన్యానికి మాత్రమే వివరణ ఇవ్వడాన్ని ఇతర జర్నలిస్టులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా తాను ఇప్పటి వరకు ఎవరిపైనా దాడి చేసిన దాఖలాలు లేవన్నారు.
తనకు మీడియా అంటే ముందు నుంచీ గౌరవం ఉందన్నారు. తాను సభ్యత కలిగిన వ్యక్తినని, తాను క్రమశిక్షణ కలిగి ఉండాలని కోరుకుంటానని స్పష్టం చేశారు మంచు మోహన్ బాబు. దాడి చేయడం తప్పేనని, ఆ పరిస్థితుల్లో కంట్రోల్ తప్ప లేదన్నారు. కావాలని ఎవరిపై తనకు ద్వేషం ఉండదన్నారు. తనకు మీడియాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు.
అక్కడ చోటు చేసుకున్న పరిస్థితిని, సందర్భాన్ని అర్థం చేసుకోవాలని , అయితే ఘటన జరగడం బాధాకరమని అన్నారు . ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానని తెలిపారు.