తగాదాలు సహజం మేమే పరిష్కరించుకుంటాం
స్పష్టం చేసిన మంచు మోహన్ బాబు
హైదరాబాద్ – ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రతి కుటుంబంలో తగాదాలు, గొడవలు సహజమని పేర్కొన్నారు. ఇలాంటి వాటి గురించి పట్టించుకుంటే ఎలా అని ప్రశ్నించారు. సముద్రం మీద నీటి బొట్లు లాంటివి ఇలాంటివి అని కొట్టి పారేశారు.
నేను ఎంతో కష్టపడి పైకి వచ్చాను. అత్యంత పేద కుటుంబం మాది. క్రమశిక్షణ, నిజాయితీ అనేది నేను మా పేరెంట్స్ నుంచి నేర్చుకున్నానని అన్నారు. కుటుంబంలో అప్పుడప్పుడు మనస్పర్థలు రావడం మామూలేనని చెప్పారు.
ఇదిలా ఉండగా తనపై , కుటుంబంపై తనయుడు మంచు మనోజ్ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత మోహన్ బాబు సైతం మంచు మనోజ్, భార్య మౌనికా రెడ్డిపై రాచకొండ పోలీస్ కమిషనర్ కు కంప్లైంట్ చేయడం కలకలం రేపింది.
ఈ తరుణంలో మంగళవారం విచారణ నిమిత్తం మోహన్‌బాబు ఇంటికి చేరుకున్నారు పోలీసులు. తమ ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇదని, తామే పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు.. గతంలో ఎన్నో కుటుంబాల సమస్యలు పరిష్కరించా, కలిసేలా చేశానని అన్నారు.