మనోజ్ పై నిర్మలా దేవి ఫిర్యాదు
మంచు విష్ణుకు కూడా అంతే హక్కు
హైదరాబాద్ – మంచు మోహన్ బాబు కుటుంబంలో ఇంకా ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఓ వైపు రాచకొండ సీపీ సుధీర్ బాబు వార్నింగ్ ఇచ్చినా వీరు మారడం లేదు. తాజాగా మరో ఫిర్యాదు నమోదైంది. మోహన్ బాబు భార్య నిర్మలా దేవి బయటకు వచ్చారు. కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆమె మంచు మనోజ్ పై మోహన్ బాబుపై సంచలన ఆరోపణలు చేశారు. నిర్మలా దేవి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన కొడుకు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. తన పుట్టిన రోజు సందర్బంగా మంచు విష్ణు ఇంటికి వచ్చాడని అన్నారు.
కేక్ తీసుకు వచ్చి కట్ చేయించాడని వెల్లడించారు. ఇంట్లోని జనరేటర్ లో చక్కెర పోశారని మనోజ్ తప్పుడు ఆరోపణలు చేశారంటూ వాపోయారు. తన ఇంట్లో మనోజ్ కు ఎంత హక్కుందో విష్ణుకు కూడా అంతే హక్కుందని చెప్పారు నిర్మలా దేవి.
మంచు విష్ణు దౌర్జన్యంతో ఇంట్లోకి ప్రవేశించ లేదన్నారు. కావాలని డ్యామేజ్ చేయడం మంచి పద్దతి కాదని కొడుకు మంచు మనోజ్ కు హితవు పలికారు.