భారతీయులు ముగ్గురు పిల్లల్ని కనాలి – మోహన్ భగవత్
సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్
నాగ్ పూర్ – రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జాతీయ అధ్యక్షుడు మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భారతీయులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. భారతీయ కుటుంబాలు కనీసం ముగ్గురు పిల్లలను కనాలని పిలుపునిచ్చారు.
ఒక కమ్యూనిటీకి సంబంధించి జనా 2.1 సంతానోత్పత్తి రేటు కంటే తక్కువగా ఉన్నప్పుడు ఆ సమాజం అంతరించి పోతుందని హెచ్చరించారు మోహన్ భగవత్.
దీని కారణంగా చాలా భాషలు ,సమాజాలు ఉనికిలో లేకుండా పోయాయని పేర్కొన్నారు . కాబట్టి, మన జనాభా 2.1 కంటే తక్కువగా ఉండకూడదని స్పష్టం చేశారు.
చాలా మంది యువ జంటలు ఒక్క బిడ్డను కూడా తీసుకోవడానికి సిద్ధంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ఎస్ఎస్ చీఫ్.
ఆదివారం నాగ్‌పూర్‌లో కథలే కుల్ (వంశం) సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి ప్రత్యేక అతిథిగా హాజరై ప్రసంగించారు మోహన్ భగవత్.