పట్నాయక్ తో సీఎం మాఝీ భేటీ
తనకు సహకరించాలని విన్నపం
ఒడిశా – సుదీర్ఘ కాలం పాటు ఒడిశాలో కొలువు తీరిన నవీన్ పట్నాయక్ కు 2024లో జరిగిన ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలింది. ఆయన 24 ఏళ్ల పాటు పాలన సాగించారు. అన్ని రంగాలలో రాష్ట్రాన్ని అభివృద్ది పథంలోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు.
ఈ తరుణంలో ఊహించని రీతిలో దెబ్బ కొట్టాడు కొత్తగా భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష నాయకుడిగా ఎన్నికైన మోహన్ చరణ్ మాఝీ. ఆయన రాష్ట్రం లోనే కాదు భారత దేశ రాజకీయాలలో సంచలనంగా మారారు.
ఆయన బీజేపీని అధికారంలోకి తీసుకు రావడంలో ఎనలేని కృషి చేశారు. కొత్తగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొలువు తీరనున్నారు. ఈ సందర్బంగా రాజకీయంగా విభేదించినప్పటికీ మోహన్ మాఝీ మర్యాద పూర్వకంగా బుధవారం మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో భేటీ అయ్యారు.
తనను ఆశీర్వదించాలని, పాలనా పరంగా మీ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు . యువ గిరిజన నాయకుడిని ప్రత్యేకంగా అభినందించారు మాజీ సీఎం.