Tuesday, April 22, 2025
HomeDEVOTIONALజ‌గ‌న్మోహ‌నాకారుడిగా రాముడు

జ‌గ‌న్మోహ‌నాకారుడిగా రాముడు

మోహినీ అలంకారం అద్భుతం

ఒంటిమిట్ట – ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం ఉదయం మోహినీ అలంకారంలో రాముల వారు జగన్మోహనాకారుడిగా దర్శనం ఇచ్చారు. ఉదయం 7.30 గంటలకు స్వామివారి ఊరేగింపు వైభవంగా ప్రారంభమైంది.

కేరళ డ్రమ్స్, భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.

మోహినీ అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణింపబడింది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీర సాగరాన్ని మథిస్తారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది. దానిని పంచుకోవడంలో కలహం ఏర్పడుతుంది.

ఆ కలహాన్ని నివారించి, దేవతలకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరిస్తాడు. తనకు భక్తులు కాని వారు ఆ మాయలో ఉంటారనీ తనకు ప్రసన్నులైనవారు మాయను సులభంగా దాటగలరనీ ఈ మోహినీ రూపంలో రాములవారు ప్రకటిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ నటేష్ బాబు, సూపరింటెండెంట్ హనుమంతయ్య టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments