సినీ గాయని కల్పన కూతురు దయ కామెంట్
హైదరాబాద్ – సినీ గాయని కల్పన ఆత్మహత్యయత్నానికి ప్రయత్నం చేయలేదని స్పష్టం చేసింది కూతురు దయ. తన తల్లి అనుకోకుండా ఎక్కువ మోతాదులో మందులు తీసుకుందని తెలిపింది. తమ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవని చెప్పింది. సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసిందంటూ అనవసర రాద్దాంతం చేయొద్దంటూ కోరింది. దీని వల్ల ఫ్యామిలీ డిస్ట్రబ్ అవుతుందని వాపోయింది. తన తల్లి లాతో పాటు పిహెచ్‌డి చేసిందని, సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదని పేర్కొంది.
మీడియాతో మాట్లాడరు సింగర్ కల్పన కూతురు దయ. పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఎందుకని రెండు రోజులుగా ఇంట్లోనే గొల్లెం వేసుకుని ఉన్నారన్న ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వకుండా దాటవేశారు.
అయితే కావాలని సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసిందని చెప్పడం మంచిది కాదన్నారు. తన తల్లి అనుకోకుండా అధిక మోతాదులో మందు తీసుకున్నట్లు దయా ప్రసాద్ చెప్పారు. తను పిరికిది కాదన్నారు. తన తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారని అన్నారు. దయచేసి విషయాలను మార్చకండి అంటూ కోరారు .