అనాథ పిల్లలకు ఆసరా సీఎం భరోసా
పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఆదేశం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
3 నెలల్లో అనాథ పిల్లలను గుర్తించి సాయం అందజేస్తామని వెల్లడించారు . ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు వెంటనే వివరాలు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కు అందజేయాలని ఆదేశించారు చంద్రబాబు నాయుడు.
ఏ ఒక్కరు కూడా రాష్ట్రంలో అనాథలు ఉండ కూడదని స్పష్టం చేశారు. వారికి ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందజేస్తామని , ఆ భరోసా కల్పించాలని పేర్కొన్నారు సీఎం. తల్లిదండ్రులు లేరన్న భావననే రానీయకుండా చూసుకుంటామని, స్పష్టమైన హామీని తాను ఇస్తున్నట్లు ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు.
వారిని ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, భయపడవద్దని సూచించారు. సర్కార్ అండగా ఉంటుందన్నారు.