మాజీ ఎంపీ మోపిదేవి ముహూర్తం ఫిక్స్
అక్టోబర్ 9న బాబు సమక్షంలో టీడీపీలోకి
అమరావతి – అందరి అంచనాలు తలకిందులు చేస్తూ మాజీ ఎంపీ మోపిదేవి వెంకట రమణా రావు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఆయన ఇటీవలే వైస్సార్సీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాజ్యసభ సభ్యుడి పదవికి రాజీనామా చేశారు. తాను ఇక పార్టీలో ఉండలేనంటూ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా టీడీపీ చీఫ్ , ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పూర్తిగా ఏపీలో వైసీపీని లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా పార్టీకి చెందిన సీనియర్లు, ప్రజా ప్రతినిధులను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
ఇప్పటికే తన కార్యకర్తలు, అభిమానులు, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలతో సమావేశం నిర్వహించారు మోపిదేవి వెంకట రమణారావు. వైసీపీలో ఉండటం కంటే అధికారంలో ఉన్న కూటమిలో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీలలో ఏ పార్టీలో చేరాలనేది మీరే డిసైడ్ చేయాలని మాజీ ఎంపీ సూచించారు.
ఈ మేరకు అంతా ముక్త కంఠంతో తెలుగుదేశం పార్టీలో చేరాలని మాజీ ఎంపీకి సూచించారు. ఇందులో భాగంగా ఆయన అక్టోబర్ 9న బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ కండువా కప్పుకోనున్నారు.