చిత్తూరు జిల్లాకు చెందిన నేరస్థుడు
హైదరాబాద్ – హైదరాబాద్ వేదికగా ప్రిజం పబ్ లో జరిగిన కాల్పుల ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. తన కోసం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పోలీసులు గత రెండు సంవత్సరాల నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. చాలాసార్లు తప్పించుకుని తిరుగుతున్నాడు. పబ్ లో ఉన్న విషయం తెలుసుకున్న వెంటనే సెర్చింగ్ చేపట్టారు. ఖాకీలు ఎంటరైన వెంటనే కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పోలీస్ కానిస్టేబుల్ గాయపడ్డాడు. ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్నారు.
తీవ్రంగా కానిస్టేబుల్ కు గాయాలు కావడంతో హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. పట్టుకునే ప్రయత్నంలో బౌన్సర్ కు తీవ్రంగా గాయపడ్డాడు. కొన్నేళ్ల కిందట విశాఖపట్నంలో కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. పలు నేరాలకు పాల్పడ్డాడు. చాలా పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయి. 2020లో బత్తుల ప్రభాకర్ ను వైజాగ్ లో అరెస్ట్ చేసినా తనను అదుపులో ఉంచలేక పోయారు.
తన వయసు 26 ఏళ్లు. దోపిడీకి సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో మార్చి 2022లో సాహసోపేతంగా తప్పించుకున్నాడు. అనకాపల్లి కోర్టు నుండి వైజాగ్ సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా చాకచక్యంగా జంప్ అయ్యాడు.