అప్పగించాలని కోరిన కేంద్ర ప్రభుత్వం
మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరస్థుడైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్ట్ అయ్యాడు. ఇప్పటికే ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. తమకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. లండన్ నుండి అప్పగింత కోసం ఎదురు చూస్తున్న మెహుల్ చోక్సీ , అతని మేనల్లుడు నీరవ్ మోడీ కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ. 13,500 కోట్లకు పైగా మోసం చేశారనే ఆరోపణలపై వాంటెడ్‌గా ఉన్నారు. 2018లో దేశం నుంచి పారి పోయాడు. తన అరెస్ట్ ను ధ్రువీకరించింది సీబీఐ. చోక్సీ వయసు 68 ఏళ్లు.
ముంబై కోర్టు చోక్సీపై జారీ చేసిన రెండు ఓపెన్-ఎండ్ అరెస్ట్ వారెంట్లను పోలీసులు ప్రస్తావించారని తెలిపింది. అనారోగ్యం ఇతర కారణాలను చూపుతూ అతను బెయిల్, తక్షణ విడుదల కోరే అవకాశం ఉందని సమాచారం.చోక్సీ తో పాటు నీరవ్ మోడీని తమకు అప్పగించాలని గత కొంత కాలంగా ఈడీ కోరుతోంది. దేశంలో రెండవ అతిపెద్ద బ్యాంకు అయిన PNB, చోక్సీ, మోడీ, అతని సంస్థ గీతాంజలి జెమ్స్ మేనేజింగ్ డైరెక్టర్‌తో సహా అనేక సంస్థలపై ఫిర్యాదు దాఖలు చేసింది. ముంబైలోని బ్యాంక్ బ్రాడీ హౌస్ బ్రాంచ్ అధికారులకు లంచం ఇవ్వడం ద్వారా లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (LoUలు) , విదేశీ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (FLCలు) ఉపయోగించారని ఆరోపించారు.