NEWSNATIONAL

సేవ‌కు ప్ర‌తిరూపం మ‌ద‌ర్ థెరీసా జీవితం

Share it with your family & friends

ఆగ‌స్టు 26న క‌రుణామ‌యి పుట్టిన రోజు

హైద‌రాబాద్ – ఈ భూమి మీద జీవించిన అరుదైన..మ‌హోన్న‌త‌మైన మాన‌వురాలు మ‌ద‌ర్ థెరీసా. త‌న జీవిత కాల‌మంతా ప్ర‌జా సేవ‌కే అంకిత‌మైన వ్య‌క్తి. ఆ మ‌హాత‌ల్లి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆగ‌స్టు 26 మ‌ద‌ర్ థెరీసా పుట్టిన రోజు. 1910లో పుట్టిన ఆమె 1977 సెప్టెంబ‌ర్ 5న ఈ లోకాన్ని వీడారు. త‌న 66 ఏళ్ల జీవిత కాలంలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. లెక్క‌లేన‌న్ని అవార్డులు, పుర‌స్కారాలు అందుకున్నారు మ‌ద‌ర్ థెరీసా.

ఆమె పూర్తి పేరు ఆగ్నీస్ గోక్షా బొజాక్షు . మ‌ద‌ర్ థెరీసా స్వ‌స్థ‌లం ఆల్బేనియా దేశం. రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ ఛారిటీని కోల్ క‌తాలో ఏర్పాటు చేసింది. త‌న సేవ‌ల ద్వారా గుర్తింపు పొందింది. ఈ చారిటీని 1950లో స్థాపించింది.

45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగ గ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరి చర్యలు చేసింది మ‌ద‌ర్ థెరీసా.

మాల్కం ముగ్గేరిడ్జ్ రాసిన సమ్ థింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అనే పుస్తకం, డాక్యుమెంటరీ ద్వారా 1970 ల నాటికి మానవతా వాదిగా, పేద ప్రజలు, నిస్సహాయుల అనుకూలురాలిగా అంతర్జాతీయ కీర్తి పొందింది. తన మానవ సేవకు గాను 1979లో నోబెల్ శాంతి పురస్కారాన్ని, 1980లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను పొందింది.

చారిటీ సంస్థ‌ 123 దేశాలలో 610 సంఘాలకు విస్త‌రించింది. హెచ్ఐవి, ఎయిడ్స్ (HIV/AIDS), కుష్టు, క్షయ వ్యాధి గ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల, కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాథ శరణాలయాలను, పాఠశాలలను స్థాపించింది.

చారిటీ నిర్వ‌హ‌ణ , ఖ‌ర్చుల ప‌ట్ల కొంత విమ‌ర్శ‌లు ఉన్న‌ప్ప‌టికీ మ‌ద‌ర్ థెరీసా మాన‌వ సేవ‌కు ప్ర‌తిరూపంగా నిలిచింది.