రేవంత్ నన్నే బెదిరిస్తావా
మోత్కుపల్లి నర్సింహులు
హైదరాబాద్ – సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. నా ముందు నువ్వెంత అని నిలదీశారు.
తన రాజకీయ అనుభవం ముందు నువ్వు ఎంత అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటర్ అన్నారు. నర నరాన అహంకారం నిండి ఉన్న రేవంత్ రెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదన్నారు మోత్కుపల్లి నరసింహులు.
ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తననే బెదిరింపులకు గురి చేస్తావా అని ప్రశ్నించారు. అంత దమ్ముందా నీకు అంటూ నిప్పులు చెరిగారు. పార్టీలో ఉంటే తాను నీవు చేసే చోరీ పనులకు ఎందుకు సాక్ష్యంగా ఉండాలని అన్నారు.
కావాలని రేవంత్ రెడ్డి మాదిగ సామాజిక వర్గాన్ని అణగ దొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు చెప్పారని ఒకే ఇంట్లో రెండు మూడు టికెట్లు ఇస్తున్నావని ప్రశ్నించారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని మండిపడ్డారు. ఒక్క వివేక్ ఇంట్లో ముగ్గురికి టికెట్లు అవసరమా అని నిలదీశౄరు మోత్కుపల్లి నరసింహులు.