రేవంత్ రెడ్డి ఓ దొర
మోత్కుపల్లి ఫైర్
హైదరాబాద్ – మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు నిప్పులు చెరిగారు. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఆయనకు అడుగడుగునా అహంకారంతో నిండి ఉన్నాడని ఆరోపించారు. మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డికి ఎంత సేపూ పైరవీకార్లు, డబ్బులు ఉన్న వాళ్లే కావాలని ఆరోపించారు. రంజిత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వాడు కోడిగుడ్లు అమ్ముకునేటోడని ఎద్దేవా చేశారు. బోడిగుండు అని తిట్టిన రేవంత్ రెడ్డి పార్టీలోకి చేర్చుకున్నాడని ధ్వజమెత్తారు మోత్కుపల్లి నర్శింహులు.
ప్రజలను చులకనగా చూసే సీఎంకు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు . ఈసారి జరగబోయే ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు. రాష్ట్రంలో కావాలని మాదిగ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేశాడని ఆరోపించారు మోత్కుపల్లి నర్సింహులు.
కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వన్ మేన్ షో నడుస్తోందని ధ్వజమెత్తారు. జనం అంటే ఏహ్య భావం ప్రదర్శించే సీఎంను నమ్మే స్థితిలో లేరన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు , మైనార్టీలను బురిడీ కొట్టిస్తున్నాడంటూ మండిపడ్డారు.