మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు
హైదరాబాద్ – మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై కేసులు పెట్టి జైలుకు పంపించడం తనకు బాధ కలిగించిందన్నారు. బాబు అరెస్ట్ ను ఆనాడు కేసీఆర్ ఖండించ లేదన్నారు. జగన్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరించారని ఆరోపించారు. చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని పోరాటాలు చేశామన్నారు. ఆయన కోసమే ఆనాడు బీఆర్ఎస్ పార్టీని వీడాల్సి వచ్చిందని చెప్పారు. నా రాజకీయ భవిష్యత్తును త్యాగం చేశానన్నారు. రేవంత్ రెడ్డికి గనుక స్వేచ్ఛ ఇవ్వక పోతే కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం జరుగుతుందన్నారు.
మోత్కుపల్లి నరసింహులు చిట్ చాట్ చేశారు. కీలకమైన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. తెలంగాణ కాంగ్రెస్ లో సమన్వయ లోపం కనిపిస్తోందని చెప్పారు. రేవంత్ కు పూర్తి నిర్ణయాధికారాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మారుస్తారనే ప్రచారానికి బ్రేక్ వేయాలన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని చెప్పినా తెలంగాణలో అధికారం రావడానికి రేవంత్ నాయకత్వమే కారణమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి లేకపోతే తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్ల బిల్లు ఆమోదం కావడం మందకృష్ణ మాదిగకు ఇష్టం లేదన్నారు. అందుకే.. వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. 40 ఏళ్ల మాదిగ ఉద్యమంలో మందకృష్ణ ఒక సోషల్ వర్కర్ మాత్రమేనని అన్నారు.