నిన్న విమర్శ నేడు ప్రశంస
మాట మార్చిన మోత్కుపల్లి
హైదరాబాద్ – మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం కీలక తీర్పు వెలువరించింది ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి. సీజేఐ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ నేతృత్వంలోని ఆరుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా అట్టడుగున ఉన్న వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాలంటే వర్గీకరణ ఉండాలని పేర్కొంది.
ఈ సందర్బంగా గత 30 ఏళ్లుగా అలుపెరుగని రీతిలో పోరాటం చేస్తూ వచ్చారు మందకృష్ణ మాదిగ. తన పోరాటం వల్లనే ఇది సాధ్యమైందనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇదిలా ఉండగా తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు మొండి చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ. మాలలకు సీట్లు ఇచ్చారు కానీ మాదిగలను పట్టించు కోలేదు సీఎం.
దీనిపై భగ్గుమన్నారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింములు. సీరియస్ కామెంట్స్ కూడా చేశారు. శనివారం తను మాట మార్చారు. తాను పార్టీని వీడే ప్రసక్తి లేదని, తనకు ఏ పదవి అక్కర్లేదన్నారు. వర్గీకరణపై తొలుత స్పందించింది సీఎం రేవంత్ రెడ్డినంటూ కితాబు ఇచ్చారు. ఆయనకు ధన్యవాదాలు తెలియ చేయాలని కోరారు.