NEWSTELANGANA

రేవంత్ రెడ్డి కంటే కేసీఆరే న‌యం

Share it with your family & friends

మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు

హైద‌రాబాద్ – మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌ధానంగా త‌న పార్టీకి చెందిన టీపీసీసీ చీఫ్‌, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్నారు. సోమ‌వారం మీడియాతో మాట్లాడారు మోత్కుప‌ల్లి.

మూడు రోజుల్లోనే త‌న పాల‌న ఏమిటో అర్థ‌మై పోయింద‌న్నారు. రేవంత్ రెడ్డి కంటే పాల‌నా ప‌రంగా మాజీ సీఎం కేసీఆరే న‌యం అనిపిస్తోంద‌న్నారు. త‌మ మాదిగ జాతిని ఎద‌గ‌నీయ‌కుండా కుట్ర ప‌న్నాడ‌ని , అందుకే బొంద పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు.

స్వంత ప్ర‌చారంపై ఉన్న ధ్యాస ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై లేద‌న్నారు. పొలాలు ఎండి పోతున్నా ప‌ట్టించు కోవ‌డం లేద‌ని వాపోయారు. క‌రెంట్ లేదు..ద‌ళిత బంధు అస‌లే లేద‌న్నారు. రైతు బంధు లేదు.తులం బంగారం ఊసే లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు మోత్కుప‌ల్లి.

రాష్ట్రంలో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం ద‌ర్జాగా న‌డుస్తోంద‌ని ఆరోపించారు. సీఎంను క‌లుస్తున్న వారంతా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు త‌ప్పా పేద‌లు ఎవ‌రూ రావ‌డం లేద‌న్నారు. పేరుకే ప్ర‌జా పాల‌న అని అంతా రెడ్ల చేతిలో రాష్ట్రం బందీ అయి పోయింద‌ని వాపోయారు మొత్కుప‌ల్లి న‌ర‌సింహులు.