సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం
అభినందించిన కడియం..దామోదర
హైదరాబాద్ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ బేలా త్రివేది ఒక్కరే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఎందుకంటూ ప్రశ్నించారు. మొత్తంగా 6-1 తేడాతో చివరకు అంతిమ తీర్పు వెలువరించారు సీజేఐ చంద్రచూడ్ .
ఇక ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించి సవరణలు చేయడం , అమలు చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందన్న ధర్మాసనం.. విద్య, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కోసం వర్గీకరణ వర్తింప చేయడంలో తప్పు లేదని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు పట్ల ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, ప్రజా ప్రతినిధులు స్పందించారు. ఇన్నాళ్లకు మాదిగలకు న్యాయం జరిగిందన్నారు. పార్టీలు చేయని న్యాయాన్ని సుప్రీంకోర్టు చేసిందన్నారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు.
భారత దేశంలో ప్రజాస్వామ్యం బతికే ఉందని, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నిరూపించిందని పేర్కొన్నారు.