నటి హేమపై ‘మా’ వేటు
డ్రగ్స్ సేవించినట్టు ఆరోపణ
హైదరాబాద్ – ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమకు బిగ్ షాక్ తగిలింది. ఆమెపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం మా సంస్థ చీఫ్ మంచు విష్ణు బాబు హేమపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆర్టిస్ట్ సంఘం నుంచి తొలిసారిగా వేటు వేయడం విస్తు పోయేలా చేసింది తెలుగు చలన చిత్ర పరిశ్రమను.
ఇదిలా ఉండగా బెంగళూరు కేంద్రంగా జరిగిన ఒకరి బర్త్ డే పార్టీలో నటులు శ్రీకాంత్ , ఆషి, హేమ పాల్గొన్నట్లు పోలీసులు ప్రకటించారు. మొత్తం 103 మంది పాల్గొన్నారని వెల్లడించారు. సాక్షాత్తు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ ఈ విషయాన్ని మీడియా ముందు ప్రకటించారు.
వీరిలో అందరికీ పరీక్షలు నిర్వహించగా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందన్నారు. ఇందులో నటి హేమతో పాటు మిగతా వారందరికీ తమ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు నోటీసు అందుకున్న హేమ ముందు బుకాయించే ప్రయత్నం చేసింది. చివరకు బురఖా కప్పుకుని పోలీసుల ముందుకు వచ్చింది.
కోర్టులో హాజరు పర్చడంతో ఆమెకు కస్టడీ విధించింది కోర్టు.