NEWSTELANGANA

వివ‌రాలు ఇవ్వండి స‌ర్వేలో పాల్గొనండి

Share it with your family & friends

న‌గ‌ర వాసుల‌కు పిలుపునిచ్చిన ఓవైసీ

హైద‌రాబాద్ – ఎంఐఎం చీఫ్‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వేలో ప్ర‌తి ఒక్క‌రు పాల్గొనాల‌ని కోరారు. న‌గ‌ర వాసులు ప్ర‌త్యేకించి కొంత స‌మ‌యం దీని కోసం కేటాయించాల‌ని సూచించారు.

మ‌న వివ‌రాలు ఇవ్వ‌డం వ‌ల్ల ఎంతో మేలు చేకూరుతుంద‌న్నారు. తాను కూడా స‌ర్వే అధికారులు అడిగిన ప్ర‌తి అంశానికి సంబంధించి వివ‌రాలు అంద‌జేసిన‌ట్లు తెలిపారు. మీరంతా ఇందులో భాగ‌స్వాములు కావాల‌ని పిలుపునిచ్చారు.

ఆర్థిక‌, సామాజిక‌, రాజ‌కీయ‌, విద్యా , ఆరోగ్య ప‌రంగా అద్భుతంగా త‌యారు చేశారంటూ ప్ర‌శంసించారు. ఇలాంటి వివ‌రాలు ప్ర‌తి ఒక్క‌రు క‌లిగి ఉండాల‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ. శ‌నివారం స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వేకు చెందిన ఎన్యూమ‌రేట‌ర్లు, అధికారులు ఓవైసీ నివాసానికి వెళ్లారు. ఆయ‌న ద‌గ్గ‌రుండి అన్ని వివ‌రాలు వారికి అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా వారిని అభినందించారు.