సంచలన కామెంట్స్ చేసిన ఎంపీ ఓవైసీ
హైదరాబాద్ – ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి పాకిస్తాన్ పై నిప్పులు చెరిగారు. తాను ప్రాణం ఉన్నంత వరకు ఈ దేశం కోసం పని చేస్తానని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తాను ఎంఐఎం పార్టీకి ప్రాతినిధ్యం వహించడం లేదని అన్నారు. తాను అఖండ భారతావనికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు. భారత్ సాధించిన విజయాల గురించి, తీసుకున్న నిర్ణయాల గురించి ప్రపంచానికి తెలియ చేసేందుకు వెళతానని స్పష్టం చేశారు.
దాయాది పాకిస్తాన్ కావాలని భారత దేశంతో కయ్యానికి కాలు దువ్వుతోందని ఆరోపించారు అసదుద్దీన్ ఓవైసీ. ఇది మంచి పద్దతి కాదన్నారు. దమ్ముంటే తాను పాకిస్తాన్ లో కాలు మోపుతానని, ఎవరు అడ్డుకుంటారో చెప్పాలన్నారు. తాను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతినిధుల బృందంలో ఒకడిగా ఎంపిక చేశారని, ఇందుకు తాను గర్వ పడతున్నానని చెప్పారు. ఈ మేరకు పీఎం కు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు చెప్పారు. పాకిస్తాన్ వల్ల ఈ ప్రపంచానికి నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. ఆ దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందన్నారు. ఈ విషయాన్ని ప్రతి దేశానికి తెలియ చేస్తామన్నారు.