బీటెక్ రవిపై భగ్గుమన్న అవినాష్ రెడ్డి
కూటమి నిర్వాకం రైతులకు శాపం
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి నిప్పులు చెరిగారు. వైఎస్సార్ జిల్లాలో సాగునిటీ ఎన్నికల్లో పులివెందుల సంబందించిన బిటేక్ రవి సినిమా లో లాగా మాట్లాడారని ఎద్దేవా చేశారు. బిటేక్ రవి ఆధ్వర్యంలో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేశారంటూ ఆరోపించారు.
ఇరిగేషన్ ఎన్నికలు జరుగుతున్నాయని , రైతు బకాయిలు చెల్లిస్తే ఎన్నికల్లో పోటీకి అర్హులు అవుతారని ఇది ప్రత్యేక నిబంధన అని తెలిపారు. కానీ కూటమి సర్కార్ వచ్చాక రూల్స్ కు విరుద్దంగా ప్రవర్తించారంటూ ఆరోపించారు.
ఎమ్మార్వో ఆఫీస్ లలో నో డ్యూ సర్టిఫికెట్ ఇచ్చే దానికి విఆర్వో లు అందుబాటులో లేరన్నారు. విఆర్వో లను మండల కేంద్రంలో బంధించారని మండిపడ్డారు. బిటేక్ రవి చేతగాని దద్దమ్మలా రాజకీయం చేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి.
చేతగాని దద్దమ్మలు టీడీపీ నేతలంటూ ధ్వజమెత్తారు. పోలీసులను అడ్డు పెట్టుకుని సాగునిటీ ఎన్నికలు జరుపుకుంటున్నారని ఫైర్ అయ్యారు. తప్పుడు రాజకీయాలు చేస్తున్నాడంటూ బిటేక్ రవిని ఉద్దేశించి మండిపడ్డారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ రైతులకు చేసింది ఏమీ లేదన్నారు.