కేటీఆర్ కామెంట్స్ ఎంపీ సీరియస్
దమ్ముంటే చర్చకు రావాలని సవాల్
హైదరాబాద్ – కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ నిప్పులు చెరిగారు. కేటీఆర్ కు తెలంగాణ గురించి ఏం తెలుసు అంటూ ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలు చేయడం తప్పితే ఆయనకు ఏమీ తెలియదంటూ మండిపడ్డారు.
సోనియా గాంధీ లేక పోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా అని ప్రశ్నించారు. దమ్ముంటే తన వద్దకు రావాలని సవాల్ విసిరారు ఎంపీ. గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. అందుకే జరిగిన ఎన్నికల్లో బండకేసి కొట్టారని అన్నారు. అయినా బీఆర్ఎస్ నేతలకు బుద్ది రావడం లేదన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై నోరు జారితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ విగ్రహం గురించి తలా తోకా లేకుండా మాట్లాడటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ బలరాం నాయక్. సోనియమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు .
కాంగ్రెస్ తల్లి విగ్రహం అంటూ పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.