ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ సర్కార్ పై, సీఎం రేవంత్ రెడ్డి పనితీరుపై ప్రశంసలు కురిపించడం పట్ల స్పందించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సంధ్య థియేటర్ ఘటనలో బాధిత కుటుంబాన్ని అల్లు అర్జున్ పరామర్శించక పోవడం పట్ల సీరియస్ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో బన్నీ అరెస్ట్ సక్రమమేనని చెప్పడం తమ పనితీరుకు నిదర్శనమన్నారు.
పవన్ కళ్యాణ్ వాస్తవ పరిస్థితుల గురించి మాట్లాడారని అన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. రాజకీయ నాయకుడిగా ఆయన మాట్లాడ లేదని అన్నారు. తమకు అనుకూలంగా పవన్ మాట్లాడాడని తాను అనుకోవడం లేదన్నారు ఎంపీ.
మానవత్వం కోణంలో మాట్లాడాడని ప్రశంసలు కురిపించారు. జగన్ లాంటి పాలన తెలంగాణలో లేదని పవన్ కళ్యాణ్ పేర్కొనడం పట్ల సంతోషం కలిగించిందన్నారు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ అరెస్టు విషయం దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. దీనిపై అసెంబ్లీలో సీఎం ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చర్చించారు.