కుట్రలకు కేరాఫ్ కల్వకుంట్ల కుటుంబం
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ – ఎవరిది కుట్ర అంటూ నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎక్స్ వేదికగా సీరియస్ గా స్పందించారు.
కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నీది కుట్ర..నీ అయ్యది కుట్ర అంటూ పేర్కొన్నారు. తరతరాలకు సరిపోయే భూమిని ఒక దశాబ్దంలోనే దోచిన ఘనత మీది కాదా అంటూ ప్రశ్నించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
ఫాంహౌస్ ల కోసమో… రిసార్టుల కోసమో కాదుజ,. ఉద్యోగ ఉపాధి అవకాశాల సృష్టికి తమ ప్రయత్నాన్ని అడ్డుకుంటున్న నీది అసలైన కుట్ర అంటూ ఎద్దేవా చేశారు.
పదేళ్లలో తెలంగాణను అప్పుల పాలు చేసి…బిడ్డలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసిన మీది కుట్ర కాదా అంటూ నిప్పులు చెరిగారు చామల కిరణ్ కుమార్ రెడ్డి.
మల్లన్న సాగర్ ను కన్నీటి సాగర్ గా మార్చింది మీరు కాదా, రంగ నాయక సాగర్ ను రక్తాలు పారే సాగర్ గా కుట్ర పన్న లేదా అంటూ ప్రశ్నించారు.
అరెస్టు… అరెస్టు… అరెస్టు అని తెగ కలవరిస్తున్నావు…ఇది కదా నీ అసలు భయం అంటూ కేటీఆర్ ను ఉద్దేశించి మండిపడ్డారు ఎంపీ.