అల్లు అర్జున్ పై చామల కన్నెర్ర
సీఎంను టార్గెట్ చేస్తే ఎలా
హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన నటుడు అల్లు అర్జున్ తో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ లపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వీడియో ద్వారా మాట్లాడారు. షాకింగ్ కామెంట్స్ చేశారు.
సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ సారీ (తప్పైందని) చెబుతాడని అనుకుంటే పైపెచ్చు తమ పార్టీ నాయకుడు, సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
పర్మిషన్ లేకున్నా ఎలా హాజరయ్యారంటూ ప్రశ్నించారు. ఆరోజు జరిగిన ఘటన అత్యంత బాధాకరమని , ఇప్పటి వరకు ఎందుకు పరామర్శించ లేదో నటుడు చెప్పాలని నిలదీశారు. ఎప్పటికప్పుడు హీరోయిలు, సినీ రంగానికి చెందిన వారు తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఫోటోను, వీడియోలను మీ పీఆర్ టీం బాగా ఎన్ క్యాష్ చేసేందుకు ప్రయత్నం చేసిందన్నారు.
కానీ బాధితుల ఇంటిని పరామర్శించేందుకు తీరిక లేకుండా పోవడం విడ్డూరంగా ఉందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇక నుంచి బెనిఫిట్ షోస్ , టికెట్ల రేట్ల ధరలు పెంచడం జరగదని చెప్పినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ తెలిపారు ఎంపీ.