నిప్పులు చెరిగిన కాంగ్రెస్ ఎంపీ
హైదరాబాద్ – భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తను గల్లీ స్థాయి లీడర్ లాగా మాట్లాడుతున్నాడని, కేంద్ర మంత్రి హోదాలో ఉన్నానన్న సోయి లేకుండా ఎలా పడితే అలా మాట్లాడితే మంచిది కాదన్నారు.
ప్రజా యుద్ద నౌక గద్దర్ గురించి మాట్లాడే నైతిక హక్కు బండికి లేదన్నారు. ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన గద్దర్ ఎక్కడ నువ్వు ఎక్కడ అంటూ మండిపడ్డారు. ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, బండకేసి కొట్టడం ఖాయమన్నారు.
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ లు తమ ఉన్నతమైన హోదాలను మరిచి పోయి మాట్లాడుతున్నారని, తమంతకు తామే తమ స్థాయిని తగ్గించుకుంటున్నారని ఆ విషయం గుర్తిస్తే మంచిదన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
ప్రజలు అన్నీ గమనిస్తుంటారని, అధికారం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోరని , జర జాగ్రత్త అని సుతిమెత్తగా హెచ్చరించారు.