ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్
హైదరాబాద్ – ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన మాజీ మంత్రి కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకున్నారు. తను ఆమరణ దీక్ష చేపడతానంటూ ప్రకటించడంపై స్పందించారు. ఇది విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏనాడూ దళితులను గౌరవించిన పాపాన పోలేదన్నారు. అందుకే వారిని జనం నమ్మలేదన్నారు. ప్రతిపక్షానికే పరిమితం చేశారంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్ ను ఉద్దేశించి. ఆనాడు నామ మాత్రంగా తాటికొండ రాజయ్యను డిప్యూటీ సీఎం ని చేసి కొన్ని రోజులకే పదవి నుంచి తీసేశారని ఆరోపించారు. శుక్రవారం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ప్రణబ్ ముఖర్జీ వస్తే కాళ్లకు దండం పెట్టిన కేసీఆర్, రామ్ నాథ్ కోవింద్ వస్తే కనీసం పట్టించు కోలేదన్నారు. ఇది దొర మనస్తత్వానికి, అహంకార పూరిత ధోరణికి నిదర్శనమ్నారు ఎంపీ. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ కు స్పీకర్ అంటే ఏంటో, ఆ కుర్చీకి ఉన్న విలువ ఏంటో తెలియదా అని ప్రశ్నించారు. దళితుడిని అవమానించిందే గాక వెళ్లి అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చోవడం దారుణమన్నారు. ప్రజలు కేసీఆర్ ను , ఆయన కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని క్షమించరని అన్నారు. ఇకనైనా విషయం తెలుసుకుని ప్రధాన ప్రతిపక్షంగా గౌరవ ప్రదంగా వ్యవహరిస్తే మంచిదని హితవు పలికారు చామల కిరణ్ కుమార్ రెడ్డి.