NEWSTELANGANA

బండి లేనప్పుడు బీజేపీ గెలిచింది

Share it with your family & friends

ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ కామెంట్స్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో త్వ‌ర‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే 17 సీట్ల‌కు సంబంధించి భార‌తీయ జ‌న‌తా పార్టీ అధిష్టానం 9 సీట్ల‌కు సంబంధించి అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. సిట్టింగ్ ల‌కు ఛాన్స్ ఇచ్చింది. ఇంకొన్నింటిని పెండింగ్ లో పెట్టింది. విచిత్రం ఏమిటంటే టికెట్ ను ఆశించిన వారికి నిరాశ మిగిలింది.

ఇది ప‌క్క‌న పెడితే నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మపురి అర్వింద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ మాజీ చీఫ్ , ఎంపీ బండి సంజ‌య్ పై సీరియ‌స్ కామెంట్స్ చేశారు. బండిని తొల‌గించ‌డం వ‌ల్ల‌నే త‌మ పార్టీ గ్రాఫ్ ప‌డి పోయిందంటే తాను ఒప్పుకోనంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టారు ఎంపీ.

2019లో తమ పార్టీ 4 లోక్ స‌భ సీట్లు గెలిచింద‌న్న విష‌యం గుర్తు పెట్టుకోవాల‌న్నారు. బండి ఆనాడు చీఫ్ గా లేడ‌ని పేర్కొన్నారు . బండి సంజ‌య్ అధ్య‌క్షుడు అయిన త‌ర్వాత నాగార్జున సాగ‌ర్ , మునుగోడు ఎన్నిక‌ల్లో ఓడి పోయామ‌ని అన్నారు. తాము గెలిచామంటే అంద‌రి కృషి వ‌ల్ల‌నే విజ‌యం సాధించ‌డం జ‌రిగింద‌న్నారు.

బండి సంజ‌య్ టైమ్ అయి పోయింద‌న్నారు. అందుకే పార్టీ ఆయ‌న‌ను త‌ప్పించింది. సీనియ‌ర్ నాయ‌కుడిని అధ్య‌క్షుడిగా చేశార‌ని స్ప‌ష్టం చేశారు ధ‌ర్మ‌పురి అర్వింద్.