NEWSTELANGANA

ప్ర‌జ‌ల రుణం తీర్చుకుంటా

Share it with your family & friends

ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌క‌ట‌న

మ‌ల్కాజిగిరి – భార‌తీయ జ‌న‌తా పార్టీ పార్ల‌మెంట్ స‌భ్యుడు ఈట‌ల రాజేంద‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను ఎంపీగా గెలిపించిన మ‌ల్కాజిగిరి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు తాను ఎల్ల‌వేళ‌లా రుణ‌ప‌డి ఉంటాన‌ని చెప్పారు. ఆదివారం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఎల్బీ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో త‌న స్నేహితుల ఆధ్వ‌ర్యంలో ఆత్మీయ స‌మ్మేళ‌నం నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు ఈట‌ల రాజేంద‌ర్. ప్ర‌భుత్వాన్ని డ‌బ్బుల‌తో, వ్యాపార కోణంలో చూడ‌వ‌ద్ద‌ని కోరారు. ఎక్స్ ప్రెస్ హైవేలు నిర్మిస్తే వేలాది మందికి ఉపాధి క‌లుగుతుంద‌ని చెప్పారు.

తాగే నీరు, నడిచే రోడ్లు, పారే మురికి కాలువలు, ఉపాధి లేక అన్నమో రామచంద్ర అని ఎంతో దీనంగా బతుకుతున్న నిరుద్యోగ యువతకు ఉన్నంతలో నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేసేందుకు కృషి చేస్తాన‌ని అన్నారు ఈట‌ల రాజేంద‌ర్.

త‌న‌ను భారీ మెజారిటీతో గెలిపించిన‌ మల్కాజిగిరి నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకోవడానికి కచ్చితంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు.