వెంకయ్య జీవితం ఆదర్శప్రాయం
ప్రశంసించిన ఎంపీ గల్లా జయదేవ్
అమరావతి – మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు జీవితం ఆదర్శ ప్రాయమని ఎంపీ గల్లా జయదేవ్ ప్రశంసలు కురిపించారు. తన నివాసంలో కలిసి ప్రత్యేకంగా అభినందించారు. రైతు కుటుంబం నుంచి దేశంలో అత్యున్నతమైన పదవి ఉప రాష్ట్రపతిని అలంకరించడమే కాకుండా తమ లాంటి ప్రజా ప్రతినిధులకు స్పూర్తి దాయకంగా నిలిచారని కొనియాడారు.
ఆయన కాలంలో తాను ఉన్నందుకు ఆనందంగా ఉందన్నారు గల్లా జయదేవ్. ట్విట్టర్ వేదికగా వెంకయ్య నాయుడుతో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నారు. ఇలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని పేర్కొన్నారు. ఇదే సమయంలో దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించినందుకు కేంద్ర సర్కార్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు దిగ్గజాలకు ప్రకటించడం అనేది తెలుగు వారందరికీ గర్వ కారణమని అన్నారు గల్లా జయదేవ్. ఈ ఇద్దరిలో ఒకరు ముప్పవరపు వెంకయ్య నాయుడు అయితే మరొకరు తెలుగు సినిమా రంగానికి చెందిన చిరంజీవి కావడం విశేషమని వారికి కూడా కంగ్రాట్స్ తెలియ చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఎంపీ.