కలిసి నడుద్దాం ముందుకు సాగుదాం
అమలాపురం ఎంపీకి పవన్ కళ్యాణ్ సూచన
ఢిల్లీ – ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఆయన కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అనంతరం పార్లమెంట్ సమావేశాలలో బిజీగా ఉన్నప్పటికీ ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ కు టైం ఇవ్వడం విశేషం. దీంతో కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కీలకమైన వ్యక్తిగా మారి పోయారు.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఢిల్లీలో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన, టీడీపీ , భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలు హాజరయ్యారు. విచిత్రం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలు సైతం పాల్గొనడం విశేషం.
ఈ సందర్బంగా అమలాపురం లోక్ సభ ఎంపీ, దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్ బాలయోగి సైతం విందుకు హాజరయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎంతో కీలక చర్చలు జరిపామని తెలిపారు ఎంపీ. పార్టీలు వేరు అయినప్పటికీ ఏపీ అభివృద్ది కోసం కలిసికట్టుగా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. పవన్ తో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నారు ఎంపీ .