ఎంపీ లక్ష్మణ్ కు కీలక బాధ్యతలు
అప్పగించిన భారతీయ జనతా పార్టీ
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ కు కీలక బాధ్యతలు దక్కాయి. ఈ విషయాన్ని బీజేపీ హైకమాండ్ సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుతం లక్ష్మణ్ చేసిన సేవలకు గాను అధిష్టానం ఆయనకు అత్యున్నతమైన ఎంపీ పదవిని ఏరికోరి కట్టబెట్టింది. మోడీకి నమ్మకమైన బృందంలో కె. లక్ష్మణ్ కూడా ఒకరు. ఈ మేరకు పార్టీ ఆయనకు బీజేపీ కోర్ కమిటీలో చోటు కల్పించింది. తాజాగా మరో కీలక పోస్ట్ ను కేటాయించింది.
ప్రస్తుతం దేశంలో జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికలు పూర్తయ్యాయి. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు సంబంధించి శాసన సభ ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేసింది. ఈ విషయాన్ని సీఈసీ ప్రకటించింది.
దీంతో భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. తాజాగా జరిగిన స్వార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి ఆశించిన మేర సీట్లు రాలేదు. దీంతో ఎలాగైనా సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు కె. లక్ష్మణ్ కు బీజేపీ కేంద్ర సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ గా నియమించింది. సహ రిటర్నింగ్ అధికారులుగా నరేష్ బన్సల్, రేఖా వర్మ, సంబిత్ పాత్ర ను నియమించింది.
ఇక కె. లక్ష్మణ్ ప్రస్తుతం బీజేపీ ఓబీసీ మోర్చా ఆలిండియా ప్రెసిడెంట్ గా ఉన్నారు. అంతే కాకుండా పార్టీకి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిటీ, పార్లమెంట్ బోర్డు మెంబర్ గా కొనసాగుతున్నారు.