రాహుల్ గాంధీకి డ్రగ్ పరీక్ష చేపట్టాలి
డిమాండ్ చేసిన ఎంపీ కంగనా రనౌత్
ఢిల్లీ – పార్లమెంట్ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. అధికార భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు బీజేపీ ఎంపీ , ప్రముఖ వివాదాస్పద నటి కంగనా రనౌత్.
ఆమె పదే పదే రాహుల్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా సభలో వ్యవహరించడం లేదని ఆరోపించారు . ఆయన తనకు తోచినట్టు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయన వల్ల సభకు అంతరాయం కలుగుతోందని, ఇతర సభ్యులు మాట్లాడేందుకు ఛాన్స్ దొరకడం లేదని ధ్వజమెత్తారు.
ఇదే సమయంలో రాహుల్ గాంధీ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందన్నారు కంగనా రనౌత్.. వెంటనే ఆయనపై విచారణకు ఆదేశించాలని కోరారు. ఇందులో భాగంగా రాహుల్ గాంధీకి డ్రగ్ టెస్ట్ చేపట్టాలని కంగనా రనౌత్ డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ తరుచూ మత్తులో ఉంటాడని, ఆయన దాని పట్ల ప్రభావానికి గురయ్యాడని ఆరోపించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది.