NEWSANDHRA PRADESH

చంద్ర‌బాబు ప‌చ్చి మోస‌గాడు

Share it with your family & friends

నిప్పులు చెరిగిన కేశినేని నాని

విజ‌య‌వాడ – బెజ‌వాడ ఎంపీ కేశినేని నాని నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ చీఫ్‌, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడ‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మోసం చంద్ర‌బాబు నైజ‌మ‌ని పేర్కొన్నారు. కేశి నేని నాని మీడియాతో మాట్లాడారు. ఈ దేశంలో ప‌చ్చి మోస‌గాళ్ల‌కు మోస‌గాడు ఎవ‌రైనా ఉన్నారంటే అది ఒకే ఒక్క‌డు బాబు అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఆయ‌న మాట‌ల‌పై నిల‌బ‌డే వ్య‌క్తి కాద‌న్నారు. ఎలాంటి విలువ‌లు ఉండ‌వ‌న్నారు. అభివృద్ది పేరుతో విధ్వంసం సృష్టించ‌డం, త‌న కులానికి పెద్ద పీట వేయ‌డం, త‌మ వారికి ఆస్తుల‌ను క‌ట్ట బెట్ట‌డం , ప్ర‌పంచ బ్యాంకుకు ఊడిగ‌డం చేయ‌డం త‌ప్ప ఆయ‌న చేసింది ఏమీ లేద‌న్నారు కేశి నేని నాని.

చంద్ర‌బాబు నాయుడు చేసే రాజ‌కీయాల‌ను చూసి రంగులు మార్చే ఊస‌ర‌వెల్లి సైతం సిగ్గు ప‌డుతుంద‌న్నారు . తెలుగు వారి ఆత్మ గౌర‌వాన్ని ఢిల్లీలో తాక‌ట్టు పెట్టిన బాబును ప్ర‌జ‌లు క్ష‌మించ‌ర‌ని అన్నారు. ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం పొత్తు పెట్టుకున్నావో చెప్పాల‌ని డిమాండ్ చేశారు కేశి నేని నాని. ఎంత మంది క‌లిసినా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఓడించ లేర‌ని అన్నారు ఎంపీ.