రేవంత్ ప్రభుత్వం కూలి పోవడం ఖాయం
బీజేపీ ఎంపీ లక్ష్మణ్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ఉన్నట్టుండి షాకింగ్ కామెంట్స్ చేశారు భారతీయ జనతా పార్టీ ఎంపీ లక్ష్మణ్. ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలి పోవడం ఖాయమని జోష్యం చెప్పారు. ఎంపీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వం పడి పోవడం పక్కా అని పేర్కొన్నారు లక్ష్మణ్. ఇదిలా ఉండగా బీజేపీ ఎంపీ చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్.
ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడ గొడతామంటూ చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. భారత రాజ్యాంగం దీనికి పూర్తిగా విరుద్దమన్నారు. ప్రజలు రాళ్లతో దాడి చేయడం తప్పదని హెచ్చరించారు.
కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ సర్కార్ ప్రతిపక్షాలు లేకుండా చేయాలని కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఈ అప్రజాస్వామిక చర్యలను ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపునిచ్చారు.