NEWSNATIONAL

సెబీ చైర్ ప‌ర్స‌న్ రాజీనామా చేయాలి

Share it with your family & friends

ఎంపీ మ‌హూవా మోయిత్రా డిమాండ్

ఢిల్లీ – టీఎంసీ ఎంపీ మ‌హూవా మోయిత్రా సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా హిండెన్ బ‌ర్గ్ నివేదిక‌లో గౌత‌మ్ అదానీకి చెందిన కంపెనీల‌లో సెబీ చైర్ ప‌ర్స‌న్ తో పాటు భ‌ర్త కూడా పెట్టుబ‌డులు పెట్టారంటూ పేర్కొనడాన్ని ప్ర‌స్తావించారు.

ఆదివారం ఎంపీ మీడియాతో మాట్లాడారు. దీనికి బాధ్య‌త వ‌హిస్తూ సెబీ చైర్ ప‌ర్స‌న్ త‌క్ష‌ణ‌మే రాజీనామా చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

కేంద్రంలో కొలువు తీరిన మోడీ భార‌తీయ జ‌న‌తా పార్టీ స‌ర్కార్ ఎలా అదానీకి మ‌ద్ద‌తు ప‌లుకుతుందో దీని ద్వారా అర్థ‌మై పోయింద‌న్నారు. ప్ర‌ధానంగా అదానీ, సెబీ మ‌ధ్య ఉన్న ర‌హ‌స్య ఒప్పందం విష‌యం గురించి పూస‌గుచ్చిన‌ట్లు హిండెన్ బ‌ర్గ్ తాజా నివేదిక‌లో బ‌ట్ట బ‌య‌లు చేసింద‌న్నారు మ‌హూవా మోయిత్రా.

గ‌తంలో హిండెన్ బ‌ర్గ్ ఇచ్చిన రిపోర్ట్ త‌ప్పంటూ అదానీ కంపెనీ క‌ప్పిపుచ్చే ప్ర‌య‌త్నం చేసింద‌న్నారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్టాల‌ని అదానీ, సెబీల‌ను ఆదేశించింద‌ని గుర్తు చేశారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు విచార‌ణ చేప‌ట్టిన దాఖ‌లాలు లేవ‌న్నారు.

వెంట‌నే అదానీ, సెబీ చైర్మ‌న్ ల మ‌ధ్య ఉన్న ఒప్పందం గురించి బ‌య‌ట పెట్టాల‌ని ఎంపీ డిమాండ్ చేశారు. సెబీ చీఫ్ మాధవి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ 10 మిలియన్ డాలర్లు అదానీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టార‌ని అన్నారు.