అభివృద్ధిపై ఏపీ సర్కార్ దృష్టి పెట్టాలి
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్
చిత్తూరు జిల్లా – వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా చ\డేపల్లిలో మీడియాతో మాట్లాడారు.
పుంగనూరు నుంచి రొంపీచర్ల వరకు నాలుగు లైన్ ల జాతీయ రహదారి నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. ఎన్నికల తర్వాత రాజకీయాలు పక్కన పెట్టీ అభివృద్ధి పై దృష్టి పెట్టాలని కోరారు ఎంపీ.
చౌడేపల్లి మండలం బోయకొండ గంగమ్మ ఆలయం అభివృద్ధి చేశామని చెప్పారు మిథున్ రెడ్డి. అమరావతి రోడ్లే కాదు పుంగనూరు మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి పూర్తి చేసేందుకు దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు.
వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నామని అన్నారు ఎంపీ. 50 శాతం కేంద్రం నిధులు ఇచ్చిందని తెలిపారు. దీనిని పూర్తి చేసేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మిథున్ రెడ్డి కోరారు. బోయకొండ ఆలయం, అగస్తేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి పై దృష్టి సారించాలని సూచించారు ఎంపీ.
ప్రజలకు, ప్రజా ప్రతినిదులు అందరికీ అందుబాటులో ఉంటామని, వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు వైసీపీ పార్లమెంట్ సభ్యులు.