NEWSANDHRA PRADESH

టీడీపీ దాడులు దారుణం – ఎంపీ

Share it with your family & friends

మిథున్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

అమ‌రావ‌తి – వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. అధికారం ఉంది క‌దా అని టీడీపీ శ్రేణులు రెచ్చి పోతున్నాయంటూ ఆరోపించారు. ఆదివారం ఎంపీ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాల అనంతరం పుంగనూరు అసెంబ్లీ, రాజంపేట పార్లమెంట్ పరిధిలో భౌతిక దాడులకు టిడిపి పాల్పడుతోందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

చాలా దారుణమైన పరిస్థితి నెల‌కొంద‌న్నారు ఎంపీ. పుంగనూరు లో ఎప్పుడు లేని కొత్త సంస్కృతికి తెర లేపుతున్నారంటూ ఆరోపించారు మిథున్ రెడ్డి. జేసిబీలు తెచ్చి పేదల ఇల్లు కూల్చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

ఎన్నికల సమయంలో రాజకీయంగా పోరాడితే అందరం స్వాగతిస్తాం, కానీ పేదల ఇళ్లపై దాడులు చేయడం దారుణం అన్నారు ఎంపీ. ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో పరిస్థితి ఈరోజు పుంగనూరు లో ఉందన్నారు.

మా వారిని ప్రరామర్శించడానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారని, ఇదేనా ప్ర‌జా ప్ర‌భుత్వం అంటే అని ఎంపీ ప్ర‌శ్నించారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌ను ప‌ర్య‌టించ‌కుండా అడ్డుకుంటే ఎలా అని ప్ర‌శ్నించారు.