NEWSTELANGANA

కేటీఆర్ కామెంట్స్ ర‌ఘునంద‌న్ రావు ఫైర్

Share it with your family & friends

అర్థం ప‌ర్థం లేకుండా మాట్లాడితే ఎలా…?

హైద‌రాబాద్ – భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ ర‌ఘునంద‌న్ రావు సీరియ‌స్ అయ్యారు. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎంపీ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. తాము క‌లిసిక‌ట్టుగా కాంగ్రెస్ పార్టీతో ప‌ని చేస్తున్నామంటూ నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌గ‌ద‌ని పేర్కొన్నారు.

ఒక‌వేళ అలాగే క‌లిసి ఉంటే ఇవాళ నువ్వు స్వేచ్ఛ‌గా ఎక్స్ లో పోస్టులు పెట్ట‌క పోయి ఉండేవాడివ‌ని పేర్కొన్నారు. ఏకంగా చ‌ర్ల‌ప‌ల్లి జైలులో చిప్ప‌కూడు తింటూ ఉండే వాడివంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఎంపీ ర‌ఘునంద‌న్ రావు.

గత పదేళ్లు అధికారంలో ఉండి అన్ని శాఖల్లో వేలు పెట్టి తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను, విద్యా వ్యవస్థను, వైద్య వ్యవస్థను చిన్నాభిన్నాం చేసిన నీలాంటి వాళ్ళ దగ్గర రాజకీయాలు ఎలా చేయాలో త‌మ‌కు బాగా తెలుస‌న్నారు. ఎప్పుడు చేయాలో నేర్చుకునే దౌర్భాగ్యం త‌మ‌కు ప‌ట్ట లేద‌ని స్ప‌ష్టం చేశారు ర‌ఘునంద‌న్ రావు.

నీకు రాజకీయాలు ఎలా చేయాలో, ప్రజల సమస్యలు ఎలా నెరవేర్చాలో తెలిసి ఉంటే ఈరోజు అధికారం కోల్పోయి ఉండేవాడివి కాదన్నారు. నిన్ను నమ్మి పార్టీ బాధ్యతలు అప్పగించిన మీ నాయనే ఈరోజు ప్రజలకు ముఖం చూపలేక ఫాంహౌస్ కు పరిమితమైండని ఎద్దేవా చేశారు.

నీ పనికిమాలిన స్టేట్మెంట్లు చూస్తుంటే నువ్వు కోల్పోయింది అధికారం మాత్రమే కాదు మెదడు కూడా కోల్పోయావని స్పష్టం అవుతుందంటూ మండిప‌డ్డారు .