సీజేఐపై నోరు పారేసుకున్న ఎంపీ
వెనక్కి తగ్గిన రామ్ గోపాల్ యాదవ్
యూపీ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పై నోరు పారేసుకున్నారు సమాజ్ వాది పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెచ్చి పోయారు. అనరాని మాటలు అన్నారు. దీంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో కాస్తా వెనక్కి తగ్గారు.
పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడం, పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సీరియస్ కావడంతో వెంటనే తన మాటలను సవరించుకునే ప్రయత్నం చేశారు రామ్ గోపాల్ యాదవ్.
రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసు తీర్పుపై సీజేఐ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ప్రశ్నకు యాదవ్ స్పందించారు. ఇందుకు సంబంధించి అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించడం విస్తు పోయేలా చేసింది.
ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ మీరు చని పోయినవారిని తిరిగి బ్రతికించినప్పుడు, అవి దయ్యాలుగా మారి న్యాయాన్ని అనుసరించడం ప్రారంభిస్తాయి. అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి?… దానిని మరచిపో, ఇలాంటి ( మూర్ఖుడు) ప్రజలు అలాంటి మాటలు చెబుతూనే ఉంటారని, నేను వాటిని గమనించాలా?” యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.