NEWSNATIONAL

మ‌న్మోహ‌న్ లేక పోవ‌డం బాధాక‌రం

Share it with your family & friends

ఎంపీ రేణుకా చౌద‌రి తీవ్ర విచారం

ఢిల్లీ – మాజీ ప్ర‌ధాన‌మంత్రి డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ ను కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌ని అన్నారు ఎంపీ రేణుకా చౌద‌రి. ఈ దేశం గొప్ప పుత్రుడిని కోల్పోయింద‌న్నారు. ఆకాశం కూడా జ‌ల్లుల‌తో నివాళులు అర్పిస్తోంద‌న్నారు. వినయం, సహనం, కలుపుగోలుతనం, శాంతి, ప్రతి మతం బోధించే అన్ని ధర్మాలను మూర్తీభవించిన అద్భుతమైన వ్యక్తిని కోల్పోవ‌డం విషాదం అని పేర్కొన్నారు.

భార‌త దేశాన్ని సంక్షోభం నుంచి గ‌ట్టెక్కించిన తీరు ఎల్ల‌ప్ప‌టికీ గుర్తుండి పోతుంద‌న్నారు రేణుకా చౌద‌రి. మ‌న్మోహ‌న్ సింగ్ స్పూర్తి దాయ‌క‌మైన జీవితం ఎంద‌రికో పాఠంగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఢిల్లీలోని భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. పుష్ప‌గుచ్ఛం ఉంచి అంజ‌లి ఘ‌టించారు.

ఇదిలా ఉండ‌గా మ‌న్మోహ‌న్ సింగ్ త‌న కెరీర్ లో ఎన్నో ఉన్న‌త‌మైన ప‌ద‌వులు నిర్వ‌హించారు. ప్ర‌పంచంలో అత్యున్న‌త‌మైన ఆర్థిక‌వేత్త‌ల‌లో డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ ఉన్నారు. 1982-1985 వరకు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. రాజ్య స‌భ స‌భ్యుడిగా, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌గా త‌న పాత్ర నిర్వ‌హించారు డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *