దేశాన్ని అవమానించడం బీజేపీకీ తగదు
నిప్పులు చెరిగిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
ఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ ఆజాద్ సింగ్ నిప్పులు చెరిగారు. భారతీయ జనతా పార్టీని ఏకి పారేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో ఆప్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. చిల్లర రాజకీయం చేయడం బీజేపీకి, దాని అనుబంధ సంస్థలకు అలవాటుగా మారి పోయిందని మండిపడ్డారు.
ప్రధానంగా భారత దేశాన్ని అవమానించే అలవాటు బీజేపీలో పాతుకు పోయిందని ఆరోపించారు. ఏదో ఒక చోట, ప్రతీసారి దేశం కోసం త్యాగం చేసిన వాళ్లను, సర్వస్వం అర్పించిన వాళ్లను, బలిదానం చేసిన వాళ్లను అవమానించడం పనిగా పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు సంజయ్ ఆజాద్ సింగ్.
బీజేపీ వాళ్లు ఒక్కోసారి 1857 విప్లవ వీరులను అవమానిస్తారు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులను కొన్నిసార్లు అవమానిస్తారు. వారి పూర్వీకులు బ్రిటిష్ వారి కోసం విప్లవ కారులపై కూడా నిఘా పెట్టారంటూ సంచలన ఆరోపణలు చస్త్రశారు ఆప్ ఎంపీ.
ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం సమీపంలో ఉన్న ఝాన్సీ రాణి లక్ష్మీబాయి విగ్రహాన్ని తొలగించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, బీజేపీకి, కాషాయ పార్టీలకు, నేతలకు, పీఎంకు, షాకు బుద్ది చెప్పడం ఖాయమన్నారు.