బీజేపీ..మోడీ..షా కుట్రలు సాగవు – సంజయ్ సింగ్
ప్రభుత్వాలను కూల్చేసే పనిలో ఫుల్ బిజీ
ఢిల్లీ – ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా , బీజేపీ, ఆర్ఎస్ఎస్ బీజేపీయేతర ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకున్నారంటూ ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను ఆప్ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంధించిన ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు సంజయ్ ఆజాద్ సింగ్. మోడీ పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి , ప్రభుత్వాలను పడ గొట్టడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటీలను దుర్వినియోగం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇది దేశానికి సరైనదేనా అని నిలదీశారు.
దేశంలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులను బీజేపీలో చేర్చుకుంటున్నారని, ఆ తర్వాత క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు సంజయ్ ఆజాద్ సింగ్. ఇలాంటి చర్యలు చేపట్టడం సబబు కాదన్నారు.
ప్రధానంగా ఆర్ఎస్ఎస్ బీజేపీకి మద్దతు ఇస్తోందని, అది చేసే దుర్మార్గపు పనులను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. 75 ఏళ్ల తర్వాత బీజేపీ నేతలు పదవీ విరమణ చేస్తారని ప్రకటించారని, ఇందుకు సంబంధించి ఇప్పటికే అద్వానీ తప్పుకున్నారని, మరి ఎందుకని మోడీ ప్రధాని పదవి నుంచి తప్పు కోవడం లేదంటూ నిలదీశారు.