శివసేన బాల్ థాకరే పార్టీ ఎంపీ రౌత్
శివసేన బాల్ థాక్రే పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే సెప్టెంబర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రిటైర్ అవుతారంటూ జోష్యం చెప్పారు. దీనిపై కీలక ప్రకటన చేయనున్నారని, అందుకే తను నాగ పూర్ కు వెళ్లారని అన్నారు. మోడీ వారసుడిని ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తుందని బాంబు పేల్చారు. ఇదిలా ఉండగా నాగ్ పూర్ లోని రేషింబాగ్ స్మృతి మందిర్ లో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెగ్డే వార్ కు ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. మోడీ వారసుడి కోసం సంస్థ ప్రయత్నం చేస్తోందంటూ పేర్కొన్నారు.
75 ఏళ్లు నిండిన మోదీ ఎందుకు రిటైర్ కావడం లేదంటూ ప్రశ్నించారు. గత 11 సంవత్సరాలలో ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించ లేదని ఆరోపించారు. మోదీ వారసుడు మహారాష్ట్రకు చెందినవాడు అవుతాడు. ఆర్ఎస్ఎస్ దానిపై నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ తో పాటు మొత్తం సంఘ్ పరివార్ దేశ నాయకత్వంలో మార్పును కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే మోదీ పదవీ కాలం ముగిసింది. ఇంకెందుకు పదవిని పట్టుకుని వేలాడుతున్నారంటూ నిలదీశారు సంజయ్ రౌత్.