NEWSNATIONAL

నిన్న సిసోడియా రేపు కేజ్రీవాల్

Share it with your family & friends

రాక త‌ప్ప‌ద‌న్న సంజ‌య్ సింగ్

ఢిల్లీ – ఆప్ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎంపీ సంజ‌య్ ఆజాద్ సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న కేంద్ర స‌ర్కార్ ను ఏకి పారేశారు. భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం ఇచ్చిన తీర్పున‌కు క‌ట్టుబ‌డి ఉంటామ‌ని చెప్పారు.

శ‌నివారం మ‌నీష్ సిసోడియాతో క‌లిసి మీడియాతో మాట్లాడారు సంజ‌య్ ఆజాద్ సింగ్. ఇంకెన్నాళ్లు కుట్ర‌లు, కుతంత్రాల‌తో కాలం వెళ్ల దీస్తారంటూ ప్ర‌శ్నించారు. ఇవాళ సిసోడియా బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని రేపు త‌ప్ప‌కుండా ఆప్ చీఫ్ , సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ రాక త‌ప్ప‌ద‌న్నారు ఎంపీ.

ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. 17 నెల‌ల పాటు తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేసినా భ‌రించిన మ‌నీష్ సిసోడియా గొప్ప నాయ‌కుడ‌ని కితాబు ఇచ్చారు. త‌మ‌కు అరెస్ట్ లు, కేసులు , వెన్నుపోట్లు కొత్త కాద‌న్నారు.

భార‌తీయ జ‌న‌తా పార్టీ, మోడీ ప‌రివారం ఎంత‌గా ప్ర‌య‌త్నం చేసినా ఫలించ లేద‌న్నారు. ఆప్ కార్య‌క‌ర్త‌లు నిజ‌మైన దేశ భ‌క్తుల‌ని వారు అమ్ముడు పోయే వారు కాద‌ని స్ప‌ష్టం చేశారు సంజ‌య్ ఆజాద్ సింగ్. ఇండియా కూట‌మి బేష‌ర‌తుగా కేజ్రీవాల్ ను బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చేందుకు పోరాడుతుంద‌ని చెప్పారు.