జైళ్ల కోసం బడ్జెట్ పెంచండి – ఎంపీ
సంజయ్ సింగ్ కామెంట్స్ నవ్వులే నవ్వులు
ఢిల్లీ – పార్లమెంట్ సమావేశాలలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ , ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ ఆద్యంతమూ ఎంజాయ్ చేశారు సభా సమావేశాన్ని. తాజాగా జరిగిన కీలక సమావేశంలో ప్రశ్నోత్తరాలకు సమయం ఇచ్చారు చైర్మన్ .
ఈ సందర్బంగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు , పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ ఆజాద్ సింగ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ప్రతిపక్షాలను లేకుండా చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, పరివారం కంకణం కట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందు కోసం జైళ్లు సరి పోవడం లేదంటూ సెటైర్ వేశారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2024లో కేవలం ఏపీ, బీహార్ రాష్ట్రాలకు ప్రయారిటీ ఇచ్చారని, కానీ ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను పట్టించు కోలేదని పేర్కొన్నారు.
ప్రతిపక్ష నేతలను జైలు పాలు చేసేందుకు గాను జైళ్లకు అత్యధికంగా నిధులు కేటాయిస్తే సరిపోతుందని అనడంతో ఒక్కసారిగా జగదీప్ ధన్ ఖర్ తో పాటు ఇతర సభ్యులు నవ్వారు.