మోదీ తేల్చుకుందాం..దా
పీఎం మోదీకి సంజయ్ సవాల్
న్యూఢిల్లీ – ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నిప్పులు చెరిగారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈడీ ఆయనను అరెస్ట్ చేసింది. ఆరు నెలల పాటు జైలులో ఉన్నారు. తాజాగా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అశేషమైన అభిమానులు, ఆప్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు సంజయ్ సింగ్ ను చూసేందుకు .
ఈ సందర్బంగా సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీని టార్గెట్ చేశారు. ఒక రకంగా ఎన్నడూ లేని రీతిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రికి పెను సవాళ్లు విసిరాడు. ఎన్ని కేసులు నమోదు చేసినా, ఎన్నేళ్లు జైలులోకి పంపినా తమను నువ్వు ఏమీ చేయలేవంటూ హెచ్చరించాడు ఎంపీ సంజయ్ సింగ్.
ఈ దేశంలో మోదీ ఒక్కడే ఉండాలని కోరుకుంటున్నాడని, కానీ ప్రజాస్వామ్యంలో ఇది చెల్లదని పీఎం తెలుసుకుంటే మంచిదన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే నామ రూపాలు లేకుండా పోతారంటూ హెచ్చరించాడు. తమను అరెస్ట్ చేయగలరే తప్పా ప్రజల్లో గూడు కట్టుకున్న ఆప్ ను చెరిపి వేయడం అసాధ్యమని తెలుసు కోవాలని స్పష్టం చేశాడు సంజయ్ సింగ్.